ఆక్యుపేషనల్ థెరపీపై అవగాహన
సాక్షి, చైన్నె: ఆక్యుపేషనల్ థెరఫీ గురించి అవగాహన కల్పించే విధంగా శ్రీరామచంద్ర వర్సిటీ విద్యార్థులు వాక్‌థాన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. శ్రీరామచంద్ర ఫ్యాకల్టీ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరఫీ విభాగం నేతృత్వంలో చైన్నె బీసెంట్ నగర్‌లో ఉదయం ఈ వాక్‌థాన్ జరిగింది. ఆ విద్యా సంస్థ అదనపు రిజిస్టార్ డాక్టర్ సెంథిల్‌మార్, ప్రొఫెసర్ పీ రఘురామ్, డాక్టర్ వి దేవకీ ఈ వాక్ థాన్‌కు జెండా ఊపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, రోగికి శస్త్ర చికిత్సలు ఎంత ముఖ్యమో, పునరావాస చికిత్సలు కూడా అంతే ముఖ్యమని వివరించారు.చివరగా డజన్ల కొద్ది రంగు రంగుల హీలియం నింపిన బెలూన్‌లను గాల్లో వదలి పెట్టి ఆక్యుపేషనల్ థెరఫీ రోగులలో ఆనందం నింపుదామని విద్యార్థులు పిలుపు నిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment