● 8 మంది అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె ఎంజీఆర్ నగర్ అన్నామె యిన్ రోడ్డులో మత్తుమాత్రలు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసన్, పోలీసులు అక్కడ చేరుకుని మత్తుమాత్రలు విక్రయిస్తున్న చోళైపళ్లం జాఫర్ ఖాన్ పేట, విరుగంబాక్కం ప్రాంతానికి చెందిన కార్తీక్ రాజా, మణి మారన్, జానకిరామన్, అహ్మద్ బాషా, వెంకటేశ్‌తో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 205 మత్తు మాత్రలు, 38 ఇంజక్షన్లు, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేకే నగర్‌లో మత్తు మాత్రలు విక్రయిస్తున్న అదే ప్రాంతానికి చెందిన మురుగేషన్, హరీష్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. వడపళనిలో గంజాయి విక్రయిస్తున్న అబ్దుల్ తమీం అనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు.
చిన్నారి గొంతు కోసిన మాంజా దారం
● విద్యార్థి సహా 10 మంది అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె, వ్యాసార్పాడిలో మాంజా దారం తగులుకుని 2 సంవత్సరాల బిడ్డ గొంతు కోసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి విద్యార్థితోసహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొడుంగయూరు ముత్తమిల్ నగర్‌కు చెందిన బాలమురుగన్, భార్య కౌసల్య. వీరి 2 సంవత్సరాల కుమారుడు పుగల్ వేలన్. ఆదివారం బాలమురుగన్ తన భార్య, బిడ్డతో మోటార్ సైకిల్‌పై బేసిన్ బ్రిడ్జి అశోక్ పిల్లర్ మార్గంలో వెళ్తున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా గాలిలో ఎగురుకుంటూ వచ్చిన మాంజా దారం బిడ్డ పుగల్‌వేలన్ గొంతుకు తగులుకుంది. బాలమురుగన్ మోటార్ సైకిల్ ఆపేలోపు బిడ్డ గొంతు కోసుకొని రక్తం వెలువడింది. దిగ్భ్రాంతి చెందిన బాలమురుగన్, కౌసల్య కుమారుడిని వెంటనే వ్యాసార్పాడి పాడిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు చేర్పించారు. అక్కడ బిడ్డకు 7 కుట్లు వేశారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై వ్యాసార్పాడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో తీవ్రంగా నిఘా వేశారు. ఇందులో మాంజా నూలుతో గాలిపటం వదులుతున్న పాఠశాల విద్యార్థులు ఐదుగురిని పట్టుకున్నారు. అలాగే సోమవారం ఉదయం మరో ఐదుగురిని పట్టుకున్నారు. గాలిపటం విక్రయదారులు, మాంజా దారం విక్రయదారులు పట్టుబడ్డారు. వారి వద్ద పోలీసులు మాంజా నూలు, గాలిపటాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 10 మందిని పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ చేస్తున్నారు.
ఆందోళనకారుల అరెస్టు
సేలం: ప్రజల్లో ఆందోళన రేకెత్తించినందుకు జాతీయ భద్రతా చట్టం కింద నెల్‌లైలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు మాట్లాడుతూ.. తిరునెల్వేలి జిల్లాలో వేర్వేరు సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రేకెత్తించే రీతిలో సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు చేస్తూ, వీడియోలను విడుదల చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలిపారు. ఆ మేరకు జిల్లా పోలీసులు చర్యలు చేపడుతూ వస్తున్నారు. ఇందుకోసం పలు సామాజిక వర్గాలకు చెందిన కార్యకర్తలను నియమించి 372 గ్రామాలలో ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ స్థితిలో సామాజిక ఉద్రికత్తత రేకెత్తించడానికి ప్రయత్నించిన దేవేంద్ర కుల వేలాలర్ ఎళిచ్చి ఇయక్కం అధ్యక్షుడు కన్నబిరాన్ పాండియన్, రాఖీ శివ ఇద్దరిని జిల్లా పోలీసుల సూచన మేరకు జిల్లా కలెక్టర్ కార్తికేయన్ ఉత్తర్వుల మేరకు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ఈ ప్రకారం నెల్‌లై నగర పోలీసు శాఖ కింద 70 మంది, జిల్లా పోలీసు శాఖ కింద 192 మంది గూండా చట్టం కింద అరెస్టు అయ్యి జైలులో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment