No Headline
సాక్షి, చైన్నె : ఈశాన్య రుతు పవనాల రూపంలో వర్షాలు విస్తృతమయ్యాయి. అయితే ఈ ప్రభావం ఉత్తర తమిళనాడు, డెల్టా జిల్లాల మీదే అధికంగా ఉంది. వివరాలు..పశ్చిమ కనుమలలో మోస్తారుగా వర్షం పడుతుండగా మిగిలిన జిల్లాలో ప్రభావం శూన్యంగా మారింది. 18 జిల్లాలోనే ఈ పవనాలు వర్షాలను కురిపిస్తున్నాయి. మిగిలిన 20 జిల్లాలో అంతంత మాత్రంగానే ఉండడం గమనార్హం. ఈ పవనాల రాకతో ఇప్పటి వరకు తూత్తుకుడి జిల్లాలో 14 సెం.మీ, తెన్‌ఆకశి జిల్లాలో 19 సెం.మీ, రాణి పేట, పెరంబలూరు జిల్లాలొఓ 23 సెం.మీ, విల్లుపురం జిల్లాలో 26, తిరువణ్ణామలై జిల్లాలో 27, కళ్లకురిచ్చి, విరుదునగర్ జిల్లాలో 28 సెం.మీ చొప్పున వర్షం పడింది. ఇక అత్యధిక వర్ష పాతం మైలాడుతురై జిల్లా 41 సెం.మీ, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలో 30 సెం.మీ చొప్పున కురిసింది. చైన్నెలో 55 సెం.మీ వర్షం ఇప్పటి వరకు ఈశాన్య రుతుపవనాల రూపంలో పడింది. ఈ పరిస్థితులలో ఆదివారం రాత్రి నుంచి డెల్టా జిల్లాలో వర్షం తీవ్రత మరింతగా పెరిగింది. నాగపట్నం, వేలాంకన్నీ, వేదారణ్యంలలో కుండ పోతగా వర్షం కురిసింది. నాగపట్నం, వేలాంకన్నీలలో అతి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్ల మీద వరదలు పారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తంజావూరులో కురిసిన భారీ వర్షం కారణంగా సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఒరత్తనాడులో వరి పొంటలన్ని వరదల ముంచెత్తాయి. నాగపట్నం, వేలాంకన్నీలో అత్యధికంగా 35 సెం.మీ , వేదారణ్యంలో 20 సెం.మీ వర్షం పడింది. ఇక్కడి లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి నీరు చేరడంతో బాధితులను శిబిరాలకు తరలించి సహాయక చర్యలను అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. డెల్టా జిల్లాలో మరో రెండు రోజుల పాటగుఆ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment