కలగలప్పు – 3కి సిద్ధం
ఫైర్ చిత్రానికి షకీలా ప్రశంసలు
తమిళసినిమా: మనసుల్ని హత్తుకునే, మనుషుల్ని ఆలోచింపజేసే కథా చిత్రాలు అరుదుగానే వస్తుంటాయి. అలాంటి చిత్రం ఫైర్ అంటున్నారు చిత్ర వర్గాలు. నిర్మాత జేఎస్‌కే ప్రధాన పాత్రను పోషించి, స్వీయ దర్శకత్వంలో జేఎస్‌కే ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మిచిన చిత్రం ఫైర్. ఈ చిత్రాన్ని మహిళలకు కోసం ప్రత్యేకంగా స్థానిక ఎన్‌ఎఫ్‌డీసీ థియేటర్‌లో ప్రదర్శించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా ఆటోడ్రైవర్లు, వివిధ శాఖల్లో పని చేసే మహిళలు ఈ చిత్రాన్ని చూసినట్లు పేర్కొన్నారు. వారితో పాటు నటి షకీలా, నటి సాక్షీ అగర్వాల్ తదితరులు కూడా ఫైర్ చిత్రాన్ని చూశారట. నేటి సమాజానికీ, ముఖ్యంగా మహిళలకు అవసరం అయిన అంశాలతో రూపొందిన చిత్ర ఫైర్ అని మహిళలు ఎంతగానో అభినందించినట్లు పేర్కొన్నారు. అందులో ఒక మహిళా ఆటోడ్రైవర్ నటుడు బాలాజీ మురుగదాస్ పోషించిన పాత్ర బాగా ఆకట్టుకోవడంతో ఆయన్ని ఉద్రేకంతో గట్టిగా కౌగిలించుకుని, పిచ్చి అవేశంతో ఏదేదో మాట్లాడిందనీ చెప్పారు. ఫైర్ చిత్రాన్ని చూసిన నటి షకీలా ఎంతగానో ప్రశంసించారని, ఈమె పేర్కొంటూ నటుడు బాలాజీ మురుగదాస్‌ను గట్టిగా కౌగిలించుకుని విడవకపోవడంతో ఇది సినిమా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేయడానికి చిత్ర వర్గాలు ఎంతగానో ప్రయత్నించి అక్కడ నుంచి పంపినట్లు చెప్పారు. అలా మహిళలను కదిలించడమే ఈ చిత్ర విజయాన్ని నిర్ణయించిందని ఫైర్ చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లులు ఈ చిత్రం గురించి గొప్పగా మాట్లాడటం పెద్ద కిరీటం చుట్టినట్లు అవుతుందన్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. చిత్రం ప్రారంభం నుంచి తదుపరి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతో కథ సాగుతుందిన ఫైర్ చిత్ర యూనిట్ పేర్కొన్నారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వారు చెప్పారు.
దర్శకుడు
సుందర్.సీ, నటి కుష్బూ
తమిళసినిమా: విజయాలకు చిరునామాగా మారిన దర్శకుడు సుందర్.సీ. ఈయన ప్రయాణం దర్శకుడిగా మొదలయినా, ఆ తరువాత కథానాయకుడిగా, నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. జనరంజకమైన చిత్రాలకు కేరాఫ్ ఈయన. అందులోనూ వినోదం, హీరోయిన్లను అందంగా తెరపై చూపించడం సుందర్.సీ స్పెషల్. నటి, నిర్మాత, రాజకీయనాయకురాలు కుష్బూ ఈయన అర్ధాంగి అన్నది తెలిసిందే. కాగా ఇటీవల అరణ్మణై చిత్రాన్ని నాలుగు సీక్వెల్స్ చేసి సక్సెస్ అయిన సుందర్.సీ హార్రర్, కామెడీ, సెంటిమెంట్ అంశాలతో కూడిన కథా చిత్రాలను తెరకెక్కించడంలోనూ సిద్ధహస్తుడని నిరూపించుకున్నారు. కాగా తాజాగా నయనతార ప్రధాన పాత్రలో మూక్కుత్తి అమ్మన్ – 2 చిత్రాన్ని తెరకెక్కింబోతున్నట్లు ఇటీవలే ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. దీన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశన్ నిర్మించనున్నారు. కాగా తాజాగా మరో చిత్రానికి సుందర్.సీ గ్రీస్ సిగ్నల్ ఇచ్చారు. ఈయన ఇంతకు ముందు కలగలప్పు 1, 2 చిత్రాలను తెరకెక్కించారు. వినోదానికి పెద్దపీట వేసిన ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో వాటికి మూడో సీక్కెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని నటి కుష్బూ సోమవారం తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. ఆమె తన అవ్నీ సినిమాస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందనీ, ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు అందులో పేర్కొన్నారు. కాగా కన్నన్ రవి గ్రూప్‌తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా గత చిత్రాల తరహాలోనే కలగలప్పు 3 చిత్రం కూడా వినోదంతో కూడిన జనరంజక కథా చిత్రంగా ఉంటుందని భావించవచ్చు.
నటి తమన్నా
తమిళసినిమా: నటుడు అరుణ్‌విజయ్ కథానాయకుడిగా పటించిన తాజా చిత్రం వణంగాన్. సంచలన దర్శకుడు బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి.హౌస్ పతాకంపై సురేశ్ కామాక్షి నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు అరుణ్‌విజయ్ దర్శకుడు బాలా గురించి మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ‘మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నేను సినీ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచీ మీ చిత్రాలు చూస్తున్నాను, మిమ్మిల్ని చూసి ఆశ్యర్యపోని రోజు లేదు. ఒక నటుడిగా మీ చిత్రంలో నటించే అవకాశం రాదా..? అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. అలాంటిది ఇప్పుడు వణంగాన్ చిత్రంలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. షూటింగ్ సమయంలో కూడా ఈ చిత్ర కథలోని అనుభూతిని నేను గ్రహించలేకపోయాను. అయితే ఇప్పుడు చిత్రాన్ని వెండితెరపై చూసినప్పుడు నా భావాలను వ్యక్తం చేయడానికి మాటలు చాలడం లేదు. నా తల్లిదండ్రులు సంతోషపడేలా చేసిన మీకు చాలా ధన్యవాదాలు. నా సినీ జీవితంలో వణంగాన్ చాలా ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ చిత్రంపై ఎంతో నమ్మకం ఉంచి, పక్కా బలంగా నిలిచిన నిర్మాత సురేశ్ కామాక్షీకి కృతజ్ఞతలు. ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రాన్ని త్వరలోనే చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని నటుడు అరుణ్‌విజయ్ వణంగాన్ చిత్రంపై తన ఆనందం వ్యక్తం చేశారు.
వణంగాన్ నా కెరీర్‌లోనే
ముఖ్యమైన చిత్రంగా ..
Comments
Please login to add a commentAdd a comment