సాక్షి, చైన్నె: ఎన్‌కౌంటర్‌లో ఇటీవల హతమైన రౌడీ ిసీసింగ్ రాజ బంధువులు, సన్నిహితులకు చెందిన 14 చోట్ల మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు విస్తృత సోదాలలో నిమగ్నమయ్యారు. కట్ట పంచాయతీలు, స్థల కబ్జాలు, హత్య కేసులలో నిందితుడైన రౌడీ సీసింగ్ రాజ కోసం పోలీసులు గతకొన్ని నెలలుగా తీవ్రంగా గాలించిన విషయం తెలిసిందే. బీఎస్పీ నేత ఆర్మ్ స్ట్రాంగ్ హత్యలో ఇతడి మీద తొలుత అనుమానాలు వచ్చాయి. ఎట్టకేలకు ఆంధ్రాలో పట్టుబడ్డ ఇతడిని చైన్నెకు తీసుకొచ్చారు. తప్పించుకునే క్రమంలో పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతం చేశారు. గతంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి వందలాది మందికి చేతులు మార్చిన సీసింగ్ రాజపై ప్రస్తుతం రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. అతడు ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో బంధువులు, సన్నిహితుల మీద గురి పెట్టారు. తాంబరం, సేలయూరు, ముడిచ్చూరు, పెరుంగళత్తూరు పరిసరాలలోని వీరి నివాసాలలో విస్తృతంగా సోదాలు జరుగుతున్నాయి. స్థల కబ్జాలకు సంబంధించి సృష్టించి డాక్యుమెంట్లు, స్థలాలను చేతులు మార్చడం ద్వారా సంపాదించిన ఆస్తులు తదితర వివరాల సేకరణలో 14 మంది రెవెన్యూ అధికారులతో కూడిన బృందం నిమగ్నమైంది.
Comments
Please login to add a commentAdd a comment