అజిత్ చిత్రంలో యోగిబాబు
తమిళసినిమా: నటుడు అజిత్ ప్రస్తుతం విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇలా ఏకకాలంలో రెండు చిత్రాల్లో నటించడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. వీటిలో లైకా ప్రొడక్షనన్స్ సంస్థ నిర్మిస్తున్న విడాముయర్చి షూటింగ్ జాప్యం జరగడంతో, అజిత్ గుడ్ బాడ్ అగ్లీ చిత్రానికి కూడా కాల్ షీట్స్ కేటాయించారు. తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి త్రిష నటిస్తున్న ఇందులో ప్రసన్న సునీల్ అర్జున్‌దాస్, ప్రభు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పెన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా అజిత్ అభిమానులను ఖుషీ చేసింది. కాగా తాజాగా ఇందులో మరో ముఖ్యపాత్రకు నటుడు యోగిబాబు ఎంపిక చేశారు. ఇప్పుడు ఆయన అజిత్‌తో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నటుడు అజిత్ చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో త్రిపాత్రాబినయం చేయడం విశేషం. పూర్తిగా కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్, స్పెయిన్ దేశంలో చిత్రీకరణను జరుపుకుంది. త్వరలో తదుపరి షెడ్యూల్‌కు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నారు. కాగా చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment