తమిళసినిమా: ఇంతకుముందు నాకు చైన్నె పేరుతో ధనుష్ కథానాయకుడి నటించిన చిత్రం వచ్చిన విషయం తెలిసిందే తాజాగా తెన్‌చైన్నె ( దక్షిణ చైన్నె) పేరుతో నూతన చిత్రం రూపొందింది రంగ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విజువల్ రంగ కథా, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించి కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. నటి రియా, నితిన్ మెహతా, ఇళంగో కమరన్, దిలీపన్ కుమార్, వత్సన్ నటరాజన్, ఆరు బాల, సుమా, రామ్, విశాల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత, కథానాయకుడిగా రంగా మాట్లాడుతూ తనకు సినిమా అంటే చాలా ఇష్టం అన్నారు. దీంతో కరోనా కాలంలో కథను రాసుకుని తెన్ చైన్నె పేరుతో చిత్రం చేసినట్లు చెప్పారు. ఇది కొత్త కోణంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. నష్టాల్లో ఉన్న హోటల్ ను కాపాడుకోవడం ఒక యువకుడు ఏం చేశాడన్నదే తెన్ చైన్నె చిత్ర కథ అని చెప్పారు. చిత్రంలో ప్రముఖ నటులలో ఒకరిని హీరోగా నటింపజేయాలని భావించామని, అయితే తాను నూతన దర్శకుడిని కావడంతో తన దర్శకత్వంలో నటించడానికి ఆ నటులు సంకోశించాన్నారు.. దాంతో తానే హీరోగా నటించాలని నిర్మించుకున్నానని, తనను నమ్మి ఈ చిత్రంలో నటించిన సహా నటీనటులు, సాంకేతిక వర్గానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు అన్నారు. అందరూ ఎంతగానో సహకరించారన్నారు. చిత్రాన్ని తమిళనాడులో 50 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment