ధర్మయుద్ధం వైపు.. పీఎం మోదీ పయనం
● గవర్నర్ ఆర్‌ఎన్ రవి వ్యాఖ్య
సాక్షి,చైన్నె: ధర్మయుద్దం వైపుగా ప్రధాని నరేంద్ర మోదీ అందరినీ నడిపిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి వ్యాఖ్యానించారు. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ తామరై కులంలో గురువారం పడి అయ్యావారి కేంద్రంలో అకిల తీరట్టు అమ్మన్ ఉదయ దినం వేడుకలు జరిగింది. ఇందులో గవర్నర్ ఆర్‌ఎన్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన పూజలకు తలపాగా , పట్టు వస్త్రాలను ధరించి హాజరయ్యారు. పలు పనులకు శంకుస్థాపన చేశారు. అమ్మన్ చరిత్రను చాటే అకిల తీరట్టు అమ్మన్ వేద గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, సనాతనం, సమానత్వం గురించి వ్యాఖ్య లు చేశారు. సమానత్వ ప్రమాణాలు, ధర్మం, సంస్కారాలు, విష్ణుమూర్తి అవతారాలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ తన ప్రసంగం కొనసాగించారు. తిరుక్కురల్‌లోని అంశాలను గుర్తు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ధర్మయుద్ధానికి నాయకత్వం వహిస్తున్నారన్నారు. ధర్మయుద్ధం వైపుగా సాగుతున్న ప్రయాణానికి యావత్ ప్రజానీకం మద్దతుగా నిలవాలని పిలుపు నిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment