● యువకుడికి జీవిత ఖైదు
అన్నానగర్: కాంచీపురం జిల్లాకు చెందిన విజయకుమార్ (37). ఇతను గత 2018లో, తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న 3 ఏళ్ల బాలికను తన ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత చిన్నారి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చిందని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల సమయంలో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఆ అనంతరం జరిగిన ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు కాంచీపురం ఆల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఇంటి వద్ద విచారణ చేపట్టారు. ఇందులో విజయ్ కుమార్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించి నిందితుడు విజయకుమార్ ను అరెస్టు చేసి జైలులో ఉంచారు. దీనికి సంబంధించిన కేసు చెంగల్‌పట్టు పోక్సో కోర్టులో కొనసాగింది. ఈ స్థితిలో గురువారం తుది విచారణకు వచ్చింది. కేసును విచారించిన న్యాయమూర్తి నజీమా భాను.. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో విజయకుమార్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. రూ.2 లక్షల జరిమానా విధించారు. బాధిత చిన్నారికి ప్రభుత్వం రూ. 3 లక్షలు పరిహారంగా అందించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment