తిరుత్తణిలో కుండపోత వర్షం
●అత్యధికంగా 19 సెంమీ వర్షం ●జలదిగ్బంధంలో ఇళ్లు ●వరద ప్రవాహంతో స్తంభించిన రాకపోకలు
నీట మునిగిన వాహనాలు
తిరుత్తణి శర్మనగర్‌లో ఇళ్లను చుట్టిముట్టిన వరద నీరు
తిరుత్తణి–అరక్కోణం రోడ్డులో వరద ప్రవాహం
తిరుత్తణి: తిరుత్తణిలో కురిసిన కుండపోత వర్షానికి పట్టణం జలమయమైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు 15 గంటల వ్యవధిలో 19 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో వరద ప్రవాహం ఉప్పొంగింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో తిరుత్తణి, పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా 15 గంటల పాటు కుండపోత వర్షం కుమ్మరించింది. దీంతో పట్టణంలో పలు ప్రాంతాలు వరద ప్రవాహం చోటుచేసుకుంది. తిరుత్తణి నుంచి అరక్కోణం మార్గంలో వరద ప్రవాహం రోడ్డును ముంచెత్తింది. వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. తిరుత్తణి మున్సిపాలిటీ పరిధిలోని శర్మనగర్ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో వరదపోటుకు వాహనాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో సబ్‌వేలు నీట మునిగాయి. గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముందస్తు జాగ్రత్తగా తీర ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు.
ఆవడిలో 18.7 సెంమీ
తిరువళ్ళూరు : జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్యవస్థంగా మారింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఆవడిలో 18.7 సెంమీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా పొన్నేరిలో 3సెంమీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా గురువారం కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించింది. బస్సులు, రైళ్లు యథావిధిగా నడిచాయి. పాఠశాలకు మాత్రం సెలవులు ప్రకటించారు కూవం, కుశస్థలిలో వరద ప్రవాహం ఏర్పడింది. ఆవడి, తిరువేర్కాడు, పూందమల్లి, పట్రపెరంబదూరు, వేపంబట్టు, తిరునిండ్రవూర్, పొన్నేరి ప్రాంతాల్లోని నివాసాలకు భారీగా వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఆవడిలోని ఎంటీ హెచ్ రోడ్డులో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపి వేయగా ఆరు గంటల తరువాత పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment