కృష్ణాపురం నుంచి మిగులు జలాల విడుదల | - | Sakshi
Sakshi News home page

కృష్ణాపురం నుంచి మిగులు జలాల విడుదల

Published Fri, Dec 13 2024 1:53 AM | Last Updated on Fri, Dec 13 2024 1:53 AM

కృష్ణాపురం నుంచి మిగులు జలాల విడుదల

కృష్ణాపురం నుంచి మిగులు జలాల విడుదల

పళ్లిపట్టు: కృష్ణాపురం జలాశయం నుంచి 2వేల క్యూసెక్కుల మిగులు జలాల విడుదలతో కుశస్థలి నదిలో వరద ప్రవాహం పోటెత్తింది. పళ్లిపట్టు సమీప ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షంతో కృష్ణాపురం జలాశయానికి వర్షపునీటి రాక ఎక్కువవడంతో జలాశయం నిండడంతో మిగులు జలాలను బుధవారం అర్ధరాత్రి విడుదల చేశారు. జలాశయం నుంచి మిగులు జలాలు విడుదలతో పళ్లిపట్టు ప్రాంతంలోని కుశస్థలి నదిలో వరద ప్రవాహం పోటెత్తింది. జలాశయం నుంచి నీరు విడుదలతో నదీతీర ప్రాంతాల్లో ప్రజలను తిరువళ్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేశారు. తీర ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తు జాగ్రత్తగా శిబిరాలకు తరలించారు. వరద ప్రవాహంతో నదిలోని నెడియం, సామంతవాడ ప్రాంతాల్లో నేలమట్ట వంతెనలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు ఆగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement