అరణియార్‌ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత | - | Sakshi
Sakshi News home page

అరణియార్‌ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

Published Fri, Dec 13 2024 1:53 AM | Last Updated on Fri, Dec 13 2024 1:53 AM

అరణియార్‌ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

అరణియార్‌ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

నాగలాపురం: పిచ్చాటూరు మండలంలోని అరణియార్‌ ప్రాజెక్టు నిండిపోవడంతో అధికారులు గురువారం ప్రాజెక్టుకు ఉన్న రెండు గేట్లను ఎత్తి, నీటిని బయటకు విడుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం కారణంగా బుధవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పిచ్చాటూరు మండలంలో 40.01 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో పిచ్చాటూరులోని అరణియార్‌ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ఈ క్రమంలో గురువారం 11 గంటలకు ఇరిగేషన్‌ డీఈ రామచంద్ర ఆధ్వర్యంలో రెండు స్పిల్‌వే గేట్లను తెరిచి నీటిని బయటకు విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అరణియార్‌ ప్రాజెక్టులో 281 అడుగులు మేరకు 1.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 280.5 అడుగుల నీరు చేరిందన్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 6 వేల క్యూసెక్కు నీరు వచ్చి చేరుతుందని చెప్పారు. దీంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. అరణియార్‌ పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement