సీనియారిటీ మేరకు పదోన్నతులు కల్పించాలి
వేలూరు: ప్రభుత్వ టీచర్‌లకు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని తమిళనాడు ఒకేషనల్ టీచర్స్ అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేనా జనార్దన్ అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్కూల్ టీచర్స్ వేలూరు కార్యవర్గ సమావేశం జిల్లా కో–ఆర్డినేటర్ జోసెఫ్ అన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలను నెరవేర్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 15న మదురైలో టీచర్‌ల డిమాండ్ సాధనకు సదస్సు నిర్వహించనున్నామని ఇందులో టీచర్‌లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆర్డినెన్స్ నంబర్ 243ను రద్దు చేయాలని కోరారు. అనంతరం సమావేశంలో తీర్మానాలను తీర్మానించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తమిళనాడు హయ్యర్ సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయప్రకాష్, జిల్లా అధ్యక్షులు సెల్వకుమార్, కార్యదర్శి గుణశేఖరన్, కోశాధికారి సపిత, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెల్వం, దినేష్ ఆబ్రహం, ఆంథోని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment