
హైదరాబాద్: అంబర్‌పేట ఫ్లైఓవర్(
ఉప్పల్, రామంతాపూర్ ప్రాంతాల వారు చాదర్‌ఘట్ వెళ్లడానికి అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తా మీదుగా వాహనాలను మళ్లించుకుని అలీకేఫ్, గోల్నాక కొత్త బ్రిడ్జి మీదుగా కాచిగూడ కబేళా, చాదర్‌ఘాట్‌కు చేరుకునే వారు. ట్రాఫిక్ కష్టాలతో పాటు అరగంట సమయం వృథా అయ్యేది. అలాగే దిల్‌సుక్‌నగర్ నుంచి ఛే నంబర్ చౌరస్తా మీదుగా శివం, నల్లకుంట వారు వెళ్లే వారు సైతం గోల్నాక మీదుగా చిన్న చిన్న గల్లీల్లో నుంచి అతికష్టం మీద చేరుకోవాల్సి వచ్చేది.
చాదర్‌ఘాట్ నుంచి ఉప్పల్ వెళ్లే వారు నల్లకుంట శంకర్‌మఠం, విద్యానగర్, తార్నాక మీదుగా వెళ్లాల్సివచ్చేది. కాగా.. అంబర్‌పేట ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో వేలాది వాహనదారులు ఎంతో ఉపశమనం పొందారు. బుధవారం ఉదయం నుంచి వాహనదారులు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగించారు.
ఇక కింద పనుల్లో వేగం..
ఫ్లైఓవర్ పై నుంచి వాహనాలను అనుమతించడంతో కింద ట్రాఫిక్ తగ్గింది. దీంతో ఫ్లైఓవర్‌సర్వీసు పెండింగ్ పనుల్లో వేగం పెంచేందుకు అవకాశం ఉంది. రెండు వైపులా సరీ్వసు రోడ్డు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు. అలాగే కొన్ని సున్నిత అంశాలు సైతం ముడిపడి ఉండడంతో సర్వీసు రోడ్డు సమస్యగా మారింది. ఇకపై కింద నుంచి వాహనాల రద్దీ తగ్గడంతో జరుగుతున్న పనుల్లో వేగం పెరిగే ఆవకాశం ఉంది.