తేజోమయం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవాన్ని టీటీడీ కన్నుల పండువగా నిర్వహించింది. ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం పక్కన 80 కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత స్వామివారి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల నడుమ ఏర్పాటు చేశారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసింది. – తిరుమల
తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాని వెలిగిస్తున్న టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం
Comments
Please login to add a commentAdd a comment