చిరస్మరణీయులు అమరజీవి
తిరుపతి అర్బన్: భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం బీసీ సంక్షేమ శాఖ నేతృత్వంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మద్రాసులో జన్మించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 1952లో ఆయన సుమారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైన తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రా న్ని ప్రకటించారని తెలిపారు. అంతటి గొప్ప వ్యక్తి గురించి భావితరాలకు తెలియజేయడం ఎంతో అవసరమని సూచించారు. ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, బీసీ సంక్షేమ అధికా రి జ్యోత్స్న, సంబంధిత బీసీ సంక్షేమ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
తిరుపతి క్రైం: సామాజిక న్యాయ పోరాటయోధుడు, దేశభక్తుడు పొట్టి శ్రీరాములు వర్ధంతిని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఎస్పీ మాట్లాడుతూ మహోన్నత వ్యక్తిత్వం కలిగిన పొట్టి శ్రీరాములు జీవితం మనకు ఆదర్శమన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఏఎ స్పీలు రవిమనోహరాచారి, సాయుధదళం శ్రీనివాసులు, డీఎస్పీలు రవీంద్రా రెడ్డి, చిరంజీవి, ఎస్‌బీ సీఐ శ్రీనివాసులు, ఆర్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment