ఆవు పాఠశాల ప్రహరీ గోడ మధ్య ఇరుక్కున్న దృశ్యం
సత్యవేడు మండలంలోని పేరడం పాఠశాల వద్ద ఒక ఆవు పాఠశాల ప్రహరీ గోడ మధ్య ఇరుక్కుపోయింది. శుక్రవారం రెవెన్యూ సదస్సుకు పశువులతో నిరసన తెలిపేందుకు గ్రామస్తులు బర్రెలు, ఆవులను పాఠశాల ఆవరణలోకి తోలుకొచ్చారు. ఇందులో ఒక సూటి ఆవు ప్రహరీ–పాఠశాల గోడకు మధ్యన ఇరుక్కుపోయింది.
ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఆవు రెండు గోడల మధ్య ఉండడంతో దాని యజమాని స్థానిక సర్పంచ్, ఎంఈఓలను గోడ తొలగించి ఆవును బయటకు తీయాలని కోరారు. స్పందించిన ఎంఈఓ డీఈఓకు సమాచారం అందించారు. అనంతరం ప్రహరీ గోడను కొద్దిగా తొలగించారు. వెంటనే గోమాత ప్రహరీ దాటుకుని పరుగులు తీస్తూ వెళ్లింది. – సత్యవేడు
Comments
Please login to add a commentAdd a comment