సమన్వయంతో పని చేయాలి
అనంతగిరి: అధికారులు సమన్వయంతో పని చేసి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ధరణి, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, పాఠశాల తనిఖీలు తదితర అంశాలపై తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే పథకాలను అమలు పరచాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించే క్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. వసతి గృహాలు, పాఠశాలలో కచ్చితంగా సన్న బియ్యాన్ని అందించి నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారానికి 3 సమయాల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు. నీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సర్వే నిర్వహించిన అనంతరం ఫారాలను తప్పనిసరిగా ఎంపీడీఓ కార్యాలయాలకు అందించేలా ఎన్యుమరేటర్లకు సూచించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ధాన్యాన్ని సేకరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఈఓ రేణుకాదేవి, సీపీఓ అశోక్, వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు సూచించినకలెక్టర్ ప్రతీక్ జైన్
Comments
Please login to add a commentAdd a comment