అంతర్జాతీయ ప్రమాణాలతో ‘కోహెడ’
తుర్కయంజాల్: కొహెడలో నూతన మార్కెట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుడు పి.ఉదయ్‌కుమార్ తెలిపారు. కొహెడలో నిర్మించనున్న మార్కెట్ స్థలాన్ని శుక్రవారం నూతన పాలకవర్గం, అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఉపయోగపడేలా అన్ని రకాల సదుపాయాలతో పాటు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మార్కెట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సమీకృత మార్కెట్ నిర్మాణం ద్వారా ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయని చెప్పారు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సంబంధిత అధికారులతో సమావేశం ఉంటుందని వివరించారు. అంతకు ముందు ఫేజ్–1 కింద చేపట్టే నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కరాచారి, డైరెక్టర్లు అంజయ్య, జైపాల్‌రెడ్డి, మచ్చేందర్‌రెడ్డి, గణేశ్‌నాయక్, రఘుపతిరెడ్డి, బండి మధుసూదన్‌రావు, నవరాజ్, గోవర్ధన్‌రెడ్డి, వెంకట్‌గుప్తా, ఇబ్రహీం, రాష్ట్ర మార్కెటింగ్ అదనపు సంచాలకుడు ఆర్.లక్ష్మణుడు, ప్రాంతీయ సంచాలకుడు ఇ.మల్లేశం, జిల్లా మార్కెటింగ్ అధికారి రియాజ్, ఎస్‌ఈ లక్ష్మణ్‌గౌడ్, డీఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుడు ఉదయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment