చర్యలు శూన్యం
యాలాల: మండల కేంద్రంలో బీసీ బాలుర, బాలికలు, ఎస్సీ బాలుర వసతి గృహాలు, ఓ కేజీబీవీ పాఠశాల ఉంది. శీతాకాలం నేపథ్యంలో ఇప్పటికే అన్ని వసతి గృహాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కాగా బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల గదుల్లో ఏర్పాట్లు అధ్వాన్నంగా ఉండటంతో చలితో ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు రాత్రిళ్లు బస చేసే గదులకు విరిగిపోయిన తలుపులు, రెక్కలు లేని కిటికీలు ఉండటంతో చలికి వణికి పోతున్నారు. దీంతో విద్యార్థులు విరిగిన తలుపులకు సంచులు అడ్డుగా పెట్టి తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. దీనికి తోడు ఆయా వసతి గృహాల్లో విద్యార్థులకు వేడినీళ్లు అందించేందుకు గీజర్లు సైతం ఏర్పాటు చేయలేదు. బీసీ బాలుర వసతి గృహాంలో సుమారు 60 మంది విద్యార్థులున్నప్పటికీ, గదులు, ఇతర వసతుల ఏర్పాట్లలో సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment