ఎందుకు ఈ వ్యర్థాలను వాడుతున్నారంటే..
కోళ్ల వ్యర్థాలను తినడం వల్ల చేపలు త్వరగా బరువు పెరగడంతోపాటు మేత ఖర్చు కూడా తగ్గుతుంది. సాధారణంగా చేపలకు ఆహారంగా తవుడు, సోయాబీన్ వంటి వాటితో ఉత్పత్తి చేసిన మేతను వాడతారు. ఈ మేత మార్కెట్‌లో కిలో రూ.30 వరకు ఉంటుంది. కిలో చేపను పెంచడానికి సుమారు రూ.50కిపైగా ఖర్చవుతుంది. కానీ ఆరోగ్యవంతమైన చేపలు ఈ ఆహారంతో అందుబాటులోకి వస్తాయి. అదే కోళ్ల వ్యర్థాలతో కిలో చేపను పెంచేందుకు రూ.30లోపే ఖర్చవుతుండటం, త్వరగా చేపలు బరువు పెరుగతుండటంతో వీటిపైనే కొందరు పెంపకందారులు దృష్టిసారిస్తున్నారు. అయితే ఈ చేపలను తినేవారు అనేక వ్యాధుల బారినపడతారనే విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment