అల్లిపురం: మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధి, ఆంథోని బోర్డింగ్ హోమ్ నుంచి నలుగురు విద్యార్థులు పరారైనట్లు హోమ్ ఇన్‌చార్జ్ కచ్చా వేళంగిణి సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు. సోమవారం ఉదయం రోజువారి ప్రార్థనలకు చర్చికి వెళ్లిన గుడాల రఘు, బెడపాటి చరణ్, నక్కాన కిరణ్‌కుమార్, పచ్చిపాల కార్తీక్ సాయంత్రం 6.30 గంటలైనా కనిపించలేదు. సీసీ కెమెరాలను పరిశీలించగా గోడదూకి పారిపోయినట్లు గుర్తించారు. విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. వారంతా కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ఆర్కేబీచ్ తదితర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. వీరి ఆచూకీ తెలిసిన వారు 9182065772, 9440796010 నంబర్లలో తెలియజేయాల్సిందిగా పోలీసులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment