కోళ్ల వ్యర్థాలతో కాసుల వేట
అధికారుల తీరుపై
అనుమానాలు
గడువు ముగిసినప్పటికీ కొత్త టెండర్లను పిలిచి మరీ తెరవకుండా పాత వారినే కొనసాగించడంపై జీవీఎంసీ అధికారుల వ్యవహారశైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రెండేళ్ల క్రితం ఆన్‌లైన్ టెండర్లు కాకుండా బాక్సు టెండర్లను ఆహ్వానించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆన్‌లైన్ టెండర్లను ఈ–ప్రొక్యూర్‌మెంట్ ద్వారానే చేపడుతున్నారు. జీవీఎంసీలో మాత్రం బాక్సులను వదలడం లేదు. అందులోనూ ప్రజారోగ్య విభాగంలోనే అధికంగా బాక్సు టెండర్లను ఆశ్రయిస్తుండటం గమనార్హం. తాజాగా పిలిచిన టెండర్లు కూడా బాక్సు టెండర్లేనని తెలుస్తోంది.
టెండర్లు తెరవకుండా
పాత వారితోనే పనులు
వాస్తవానికి ప్రస్తుతం చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న ఏజెన్సీల టెండరు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్తగా టెండర్లను ప్రజారోగ్య విభాగం అధికారులు పిలిచారు. కానీ నెలలు గడుస్తున్నా వీటిని మాత్రం తెరవడం లేదు. ఈ టెండర్లను దక్కించుకునేందుకు కూటమి నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తుండటంతో టెండర్లు తెరవకుండా పాత వారితోనే పనులు కానిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం నడుపుతున్న వారితోనూ జీవీఎంసీలోని అధికార పార్టీకి చెందిన నేతలు మామూళ్లకు అలవాటు పడటంతో వీరి ఆటలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment