● సహకరిస్తున్న జీవీఎంసీ, మత్స్యశాఖ, పోలీసు విభాగాలు ●
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
ఎక్కువ లాభాలు ఆర్జించాలన్న దురాశతో చేపలకు మేతగా కోళ్ల వ్యర్థాలను భారీ స్థాయిలో తరలిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అధికారులు కూడా సహకరించడంతో ఈ దందా యథేచ్ఛగా సాగిపోతోంది. జీవీఎంసీ పరిధిలోని చికెన్, మటన్ షాపుల్లో వ్యర్థాలను కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకు తరలించేందుకు రెండేళ్ల క్రితం కొందరు కాంట్రాక్టర్లు టెండర్లు పొందారు. అయితే ఈ కోళ్ల వ్యర్థాలను అక్రమంగా చేపల చెరువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యవహారం జరుగుతున్నప్పటికీ.. ఇటు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు గానీ, అటు మత్స్యశాఖ, పోలీసుశాఖ అధికారులు గానీ కన్నెత్తి చూడటం లేదు. కాపులుప్పాడలో నిర్ణీత మొత్తంలో సేకరించిన మేరకు చికెన్ వ్యర్థాలు వస్తున్నాయా? లేదా అని పరిశీలించాల్సిన అధికారులు కూడా ఇందులో భాగస్వామ్యమై తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా మాడుగుల నియోజకవర్గంలోని దేవరాపల్లి వద్ద చికెన్ వ్యర్థాలతో వచ్చిన వాహనాన్ని ప్రజలు ఫిర్యాదు చేసి పట్టించారు. ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉండడంతో ఈ వ్యవహారాన్ని అక్కడికక్కడే తొక్కేశారు.
Comments
Please login to add a commentAdd a comment