అల్లిపురం: జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులో రోజు రోజుకీ రకరకాల ట్విస్టులు బయట పడుతున్నాయి. తాజాగా ఎన్‌ఆర్‌ఐ బాధితుని తల్లి మీడియా ముందుకొచ్చింది. ఆమె బాధితులు చాలా మంది ఉన్నారని, సమగ్ర విచారణ జరపాలని నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చిని వేడుకున్నారు. ఈమేరకు బాధితుడు తల్లి వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తన కుమారుడ్ని బిజినెస్‌లో ప్రమోట్ చేస్తానని జాయ్ జమీమా పరిచయం చేసుకుందన్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా అమెరికా నుంచి విశాఖకు రప్పించుకుందని, నా కుమారుడికి జ్యూస్‌లో మత్తుమందు ఇచ్చి నిత్యం మత్తులో దించేదని వివరించారు. హైదరాబాద్, ఢిల్లీ వంటి అనేక ప్రాంతాల్లో తిప్పి అనేక ఇబ్బందులకు గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పెట్టే ఇబ్బందులను వాయిస్ మెసేజ్ ద్వారా తనకు తెలియజేశాడని, ఈ విషయం నగర పోలీస్ కమిషనర్ బాగ్చి తమకు చాలా సహాయం చేశారన్నారు. ఆమె బాధితులు చాలా మంది ఉన్నారన్నారు. పరువు పోతుందని ఎవరు బయటకు రావడం లేదని తెలిపారు. ఈ కేసును లోతుగా విచారించాలని ఆమె పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment