డాబాగార్డెన్స్: ఉమ్మడి విశాఖ జిల్లాలో సర్వీసులో ఉంటూ మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యు లకు రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు మంగళవారం తన చాంబర్ కారుణ్య నియామకాలను నిర్వహించారు. 17 మందికి కండక్టర్లగా, ఇద్దరికి అసిస్టెంట్ మెకానిక్‌లు నియామక ఆర్డర్లు అందజేశారు.
29న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం
మహారాణిపేట: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ విశాఖ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఈనెల 29న నిర్వహించనున్నారు. కనీసం 10 మంది సభ్యులతో కూడిన జిల్లా బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ, చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారిలను ఎన్నుకుంటారని పేర్కొన్నారు. జిల్లా సహకార అధికారి ఎన్నికలను నిర్వహించనున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment