తాటిచెట్లపాలెం: విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న భద్రతా పనుల నిమిత్తం పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు.దిగువ రైళ్లు ఆయా తేదీల్లో రెగ్యులర్ మార్గంలో కాకుండా మళ్లించిన మార్గంలో వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా నడుస్తాయి. హౌరా–ఎస్‌ఎంవీబీ బెంగళూరు (12863)ఎక్స్‌ప్రెస్ 11,13,14,16,17,20, 21,23, 24వ తేదీల్లో, ధన్‌బాద్–అలెప్పీ(13351) బొకారో ఎక్స్‌ప్రెస్ ఈ నెల 16,17,20,21,23,24వ తేదీల్లో, హతియా–ఎర్నాకులం(22837) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 16,23వ తేదీల్లో, హతియా–ఎస్‌ఎంవీ బెంగళూరు (12835) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 17,24వ తేదీలలో, టాటానగర్–ఎస్‌ఎంవీ బెంగళూరు (12889) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20వ తేదీన, హతియా–ఎస్‌ఎంవీ బెంగళూరు(18637) ఎక్స్‌ప్రెస్ ఈ నెల21న, ముంబయి సీఎస్‌టీఎం–భువనేశ్వర్ (11019)కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 13,14,25,27,28,30వ తేదీల్లో, గుంటూరు–విశాఖ(17239) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 26,28,29,31వ తేదీల్లో మళ్లించిన మార్గంలో నడుస్తాయి.
పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లు మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. కొచ్చువేలి(త్రివేండ్రం నార్త్)–షాలిమర్–కొచ్చువేలి స్పెషల్, తిరునల్వేలి– షాలిమర్–తిరునల్వేలి స్పెషల్, పొదనూర్–బరౌని–పొదనూర్ స్పెషల్ , తాంబరం – సంత్రగచ్చి –తాంబరం స్పెషల్స్ జనవరి 24వ తేదీ వరకు పొడిగించారు.
Comments
Please login to add a commentAdd a comment