రింగ్ వలలతో వేట నిషేధం
మహారాణిపేట: రింగ్ వలలతో సముద్రంలో వేటకు వెళ్లేందుకు అనుమతులు లేవని, హైకోర్టు ఉత్తర్వులు అందరూ పాటించాలని ఇన్‌చార్జి ఆర్‌డీవో హెచ్‌వీ జయరామ్ అన్నారు. మంగళవారం ఆర్‌డీవో కార్యాలయంలో మత్స్యకార ప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు, పోలీసు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో మాట్లాడుతూ రింగ్ నెట్‌తో ఫిషింగ్ నిలుపుదల చేయాలని కోరారు. ద్వారకా ఇన్‌చార్జీ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు మాట్లాడుతూ మత్స్యకారులంతా సంయమనం పాటించాలని కోరారు. కార్యక్రమంలో మత్స్యకారులు పెదజాలారిపేట, జాలారి ఎండాడ, వాసవానిపాలెం తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు పాల్గొన్నారు.
హార్బర్ అభివృద్ధిపై సమీక్ష
ఫిషింగ్ హార్బర్ అభివృద్ధిపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు ఆధ్వర్యంలో సమావేశంలో పోర్టు అధికారులు, మరపడవల సంఘం నాయకులు, వివిధ మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు. హార్బ ర్‌లో బోట్ల మరమ్మతుల కోసం క్రేన్ ఏర్పాటు చేయా లని మత్స్యకార సంఘాల నాయకులు కోరారు. అలాగే హార్బర్‌లో లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏపీ మరపడవల సంఘం అధ్యక్షుడు డి.లక్ష్మయ్య కోరారు. రెండు చేపల రవాణా వాహానాలు ఏర్పాటు చేయాలని తిమ్మాపురానికి చెందిన మహిళా మత్స్యకార సంఘం నాయకులు కోరారు. కార్యక్రమంలో మత్స్య కార సంఘాల నాయకులు సీహెచ్ వీర్రాజు, బి.కొండలరావు, ఆనంద్, అమర్‌నాథ్, పోర్టు ఈఈ అరుణ్‌కుమార్, మత్స్యశాఖ ఏడీ విజయకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment