వైకల్యాన్ని జయించి.. విజేతలుగా నిలిచి
విశాఖ స్పోర్ట్స్: సంకల్ప బలం ముందు కష్టాలన్నీ అల్పమేనని నిరూపించారు..సాధించాలన్న తపన, పట్టుదల ఉంటే అంగవైకల్యం విజయానికి అడ్డుకాదని స్పష్టం చేశారు. వైకల్యం శరీరానికే గానీ..మనసుకు కాదని చాటి చెప్పారు. ఒకరికొకరు పోటీ పడుతూ స్ఫూర్తి చాటుకున్నారు విభిన్న ప్రతిభావంతులు. పోలీసు బారెక్స్ గ్రౌండ్స్‌లో విభిన్నప్రతిభావంతులకు పోటీలు నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్ధ ఆదేశాల మేరకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో డిజేబుల్ వెల్ఫేర్ శాఖ సహకారంతో పోటీలు నిర్వహించారు. దాదాపు 15 కేటగిరీల్లో మానసిక, శారీరక విభిన్న ప్రతిభావంతులు పోటీపడ్డారు. టీ 11,12,13 కేటగిరీల్లో త్రో అంశాల్లో పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఫీల్డ్‌లో సైతం పలు కేటగిరీలుగా నిర్వహించిన పోటీల్లోనూ సత్తాచాటారు. అథ్లెటిక్స్‌తో పాటు చదరంగం పోటీలను నిర్వహించారు. మెన్, వుమెన్‌కు వంద మీటర్ల పరుగు, డిస్కస్, షాట్‌ఫుట్ త్రోలోనూ పోటీలను నిర్వహించారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిజేబుల్ వెల్ఫేర్ శాఖ ఏడీ మాధవి, సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారిణి శ్రీవాణి పాల్గొనగా డీఎస్‌డీవో జాన్ గాలియట్, అథ్లెటిక్ కోచ్ వైకుంఠం, డీఎస్‌ఏ కోచ్‌లు సహాకారం అందించారు.
సందడిగా విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు
Comments
Please login to add a commentAdd a comment