విశాఖ–లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాల్లో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారం, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కేసులు, బ్యాంకు, మనీ రికవరీ, భూఆక్రమణ, కార్మిక, కుటుంబ తగాదాలు(విడాకులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారానికి ఈ అదాలత్‌లో చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవా సదన్ 0891–2560414, 2575046 ఫోన్ నెంబర్లు, vskpdlsa@yahoo.com, dlsa.vsp @gmail.com, మండల న్యాయ సేవా సంఘాలలో సంప్రదించాల్సిందిగా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment