నిధుల దుర్వినియోగం సహించబోం
ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయంటే ఎవరూ అడ్డు చెప్పరు. కానీ ప్రజాధనం దుర్వినియోగమైతే మాత్రం సహించబోం. వార్డులో దాదాపు 50 కాలనీలు ఉండగా పలు చోట్ల రోడ్లు లేవు. కానీ స్థానిక కార్పొరేటర్ ఒత్తిడితో జీవీఎంసీ అధికారులు ఇప్పటికే ఉన్న రోడ్లపై రోడ్లు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిధులు మంజూరు చేసేటప్పుడు ఉన్నతాధికారులు కూడా క్షేత్ర పరిశీలన చేయాలి. ఇప్పటికే రోడ్లు ఉన్న చోట రోడ్లు వేస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. ప్రజలకు అవసరం ఉన్న చోట అభివృద్ధి చేయాలి.
– శరగడం చినఅప్పలనాయుడు,
మాజీ కార్పొరేటర్
Comments
Please login to add a commentAdd a comment