నీలకంఠునికి నాట్య నివేదన
శివరాత్రి పర్వదినాన నీలకంఠునికి సాగర తీరంలో నాట్య నివేదన చేశారు. పైన నీలి మేఘం, చెంతనే నీలి సంద్రం.. ‘నిమగ్న’పేరిట పరంపర ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ నాట్యాచార్యులు రమా వైద్యనాథ్, బృందంతో చేసిన నృత్యాలు విశాఖవాసుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాయి. కాశీ విశ్వేశ్వరుడిని, కంచి కామాక్షిని కీర్తిస్తూ వీరు చేసిన నృత్యాలు, రాధాకృష్ణుల లీలల్ని వర్ణిస్తూ చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యువతను శాసీ్త్రయ నృత్య కళలవైపు నడిపించే దిశగా ఈ కార్యక్రమం కొనసాగింది.
8లో
Comments
Please login to add a commentAdd a comment