
మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడి మృతికి నివాళి
తగరపువలస: భీమిలి వ్యవసాయ మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఆనందపురం మండలం వేములవలసకు చెందిన ఆయన గురువారం ఆరిలోవలోని ఓ ఆస్పత్రిలో అనుమా నాస్పదంగా మృతి చెందారు. కొంతకాలంగా మానసిక వేదనతో బాధ పడుతున్న ఆయన ఇటీవల ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. టీడీపీ ఆనందపురం మండల అధ్యక్షుడిగా, వేములవలస సర్పంచ్‌గా పని చేసిన నాగ భూషణరావు పార్టీ అభివృద్ధి కోసం ఎన లేని కృషి చేశారు. ఆయన భౌతిక కాయానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పల నాయుడు, కర్రి సీతారాం తదితరులు నివాళులర్పించారు.