అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగిస్తాం | - | Sakshi

అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగిస్తాం

Apr 15 2025 1:22 AM | Updated on Apr 15 2025 1:22 AM

అంబేడ

అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగిస్తాం

రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు ● పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్‌ జయంతి

మద్దిలపాలెం: పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు అన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో లేకుండా చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. మద్దిల పాలెంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం గొల్ల బాబూరావు మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తున్నారని తెలిపారు. అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు ఒక్క పథకం కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండటానికి కారణం అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగమేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌, చింతలపూడి వెంకటరామయ్య, కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్‌ వెస్లీ, పేర్ల విజయ్‌ చందర్‌, పార్టీ ముఖ్య నాయకులు కొండా రాజీవ్‌ గాంధీ, రవిరాజు, ఫరూఖి, జహీర్‌ అహ్మద్‌, నడింపల్లి కృష్ణంరాజు, మొల్లి అప్పారావు, అల్లంపల్లి రాజబాబు, జిల్లా అధికార ప్రతినిధులు మంచా మల్లేశ్వరి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, మారుతి ప్రసాద్‌, రాంరెడ్డి, సేనాపతి అప్పారావు, దేవరకొండ మార్కండేయులు, కొండా రెడ్డి, పార్టీ నాయకుల మధుసంపతి, పత్తిపాడు వెంకటలక్ష్మి, పతివాడ కనకరాజు, వానపల్లి ఈశ్వరరావు, పెండ్ర అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగిస్తాం 1
1/2

అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగిస్తాం

అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగిస్తాం 2
2/2

అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement