ఈదురు గాలులబీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురు గాలులబీభత్సం

Published Sun, Jun 16 2024 12:36 AM | Last Updated on Sun, Jun 16 2024 12:36 AM

ఈదురు

సంతకవిటి: గోళ్లవలస రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టు

విజయనగరం పట్టణంపై కమ్ముకున్న మేఘాలు

వంగర: కోనంగిపాడులో ట్రాక్టర్‌పై కూలిన చెట్టు

రైతు ప్రాణం తీసిన విద్యుత్‌ తీగలు

నెల్లిమర్ల రూరల్‌: తెగిపడిన విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి చెందిన ఘటన నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అలుగోలు గ్రామానికి చెందిన కెల్ల అప్పలనాయుడు(65) శనివారం వేకువ జామున ఆవుల పాలు తీసేందుకు కల్లాం వద్దకు వెళ్తుండగా, సమీపంలోని రామప్పుడు కల్లాల వద్ద శుక్రవారం రాత్రి గాలి, వానకు తెగిపడిన విద్యుత్‌ వైర్లు ఆయన ఛాతికి తగలడంతో షాక్‌కు గురయ్యాడు. అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడు కుమారుడు రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రామగణేష్‌ తెలిపారు.

సాక్షి నెట్‌వర్క్‌: విజయనగరం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి చెట్లు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనుల్లో ఆ శాఖ సిబ్బంది వర్షంలోనే పరుగులు తీశారు.

● సంతకవిటి మండలంలోని అన్ని గ్రామాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. సంతకవిటిలో ఇంటి పైకప్పులు, షాపుల పైకప్పులు ఎగిరిపోవడంతో ప్రజలు భయాందోళన చెందారు.

● వంగర మండలం కోనంగిపాడులో చందక కృష్ణమూర్తికి చెందిన ట్రాక్టర్‌పై చెట్టు కూలిపోయింది. స్థానికుల సాయంతో చెట్ల కొమ్మలు తొలిగించి ట్రాక్టర్‌ను బయటకు తీశారు.

● వేపాడ మండలంలోని వేపాడ, వల్లంపూడి గ్రామాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. వల్లంపూడి నుంచి చామలాపల్లి వెళ్లే రహదారిలో దబ్బిరాజుచెరువు గట్టు, చామలాపల్లి సమీపంలో చెట్లు, స్తంభాలు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వేపాడ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చెట్టుతో పాటు ఓ వైపు గోడ పడిపోవడంతో విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. రెడ్డివీధిలో ఒకటి, రాజవీధిలో ఒకటి, పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఒకటి, శానాపతి వీధిలో ఒక విద్యుత్‌ స్తంభం విరిగిపో యాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

● బాడంగి మండలం వీరసాగరంలో ఎల్‌టీ లైన్‌కు చెందిన మూడు స్తంభాలు, గొల్లాదిలో వ్యవసాయ పంపు సెట్‌కు చెందిన రెండు స్తంభాలు, గజరాయునివలస గ్రామాల్లో చింతకొమ్మలు, టేకు చెట్లు పడిపోవడంతో మరో స్తంభం విరిగిపోయినట్టు విద్యుత్‌ శాఖ ఏఈ శ్రీనివాసరావు చెప్పారు. ఈదురుగాలులకు మండలంలో విద్యుత్‌శాఖకు సుమారు లక్షా50వేల వరకు నష్టం వాటిల్లిందన్నారు.

● రాజాం పట్టణంతో పాటు మండలంలో ఈదుర గాలులు బీభత్సం సృష్టించాయి. రాజాం, సంతకవిటి మండలాల ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడే చెట్లు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. డోలపేట పెద్దవీధిలో ఓ పశువులపాకకు ఆనుకుని ఉన్న చెట్టుపై పిడుగుపడింది. దీంతో పశువులపాకలో ఉన్న డోల గాంధీకి చెందిన రూ.40వేలు విలువైన ఆవు పిడుగుపాటుకు గురై మృతిచెందింది.

కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

రాకపోకలకు అంతరాయం

నిలిచిన విద్యుత్‌ సరఫరా

పిడుగుల వానతో జనం బెంబేలు

No comments yet. Be the first to comment!
Add a comment
ఈదురు గాలులబీభత్సం1
1/2

ఈదురు గాలులబీభత్సం

ఈదురు గాలులబీభత్సం2
2/2

ఈదురు గాలులబీభత్సం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement