విత్తన చట్టం గురించి తెలుసా.. | - | Sakshi
Sakshi News home page

విత్తన చట్టం గురించి తెలుసా..

Published Mon, Jun 17 2024 1:46 AM | Last Updated on Mon, Jun 17 2024 1:46 AM

విత్త

టెక్కలి: ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి జిల్లాలో ప్రైవేట్‌ ఎరువుల దుకాణాల్లో విత్తనాల విక్రయాలు జోరందుకున్నాయి. అయితే రైతు అవసరాన్ని ఆసరాగా చేసుకుని రైతులను మోసగించే చర్యలకు కళ్లెం వేసేందుకు విత్తన చట్టం ఒకటి ఉందని పూర్తి స్థాయిలో రైతులకు తెలియదు. విత్తనాలు కొనుగోలు చేసే రైతుకు ఎలాంటి అన్యాయం జరి గినా ఈ చట్టం ద్వారా సంబంధిత విత్తనాల డీల ర్లపై కఠినతరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. విత్తన చట్టం 1966, విత్తన నిబంధనలు 1968, విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983 తదితర చట్టా లు పొందు పరచి విత్తనపరమైన అతిక్రమణలు, ఉల్లంఘనలు వర్తించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు. విత్తన విక్రయాల్లో మోసాలకు పాల్పడిన వారిపై విత్తన నియంత్రణ ఉత్తర్వులు –1983 క్లాజు 3 అతిక్రమించినందుకు ఆయా దుకాణాల్లో విత్తనాలను జప్తు చేయడంతో పాటు అత్యవసర సరుకుల చట్టం 1955 సెక్షన్‌ ఏ ప్రకారం జరిమానాకు గురవుతారు. వీటిలో కొన్ని చట్టాలను గమనిస్తే...

విత్తన లైసెన్సు ప్రదర్శన తప్పనిసరి

ప్రైవేట్‌ విత్తనాల విక్రయ దుకాణాల్లో తప్పనిసరిగా విత్తన లైసెన్సును ప్రదర్శించాలి. విత్తన లైసెన్సు లేకుంటే ఆయా దుకాణాల్లో విత్తనాల అమ్మకాలను నిలిపివేయవచ్చు. అంతే కాక నోటీసు ఇస్తూ దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు 5 ప్రకారం డీలర్‌ లైసెన్సు సస్పెండ్‌, రద్దు చేయవచ్చు.

ధరల బోర్డు, స్టాకు బోర్డు ఏర్పాటు చేయాలి

విత్తనాలు విక్రయించే దుకాణాల్లో కచ్చితంగా ధర లు, స్టాకు బోర్డులను ఏర్పాటు చేయాలి. అలా లేకుంటే విత్తన నియంత్రణ ఉత్తర్వులు –1983 క్లాజు 8 ప్రకారం ఆయా దుకాణాల్లో విత్తనాల అమ్మకాలు నిలుపుదల చేయవచ్చు. అంతే కాకుండా అధికారులు ఇచ్చిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే లైసెన్సు సస్పెండ్‌, రద్దు చేయవచ్చు.

అమ్మకాల రశీదు ఇవ్వాల్సిందే

విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు ఆయా దుకాణదారుడు కచ్చితంగా రశీదు ఇవ్వాలి. రశీదు ఇవ్వని పక్షంలో విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు 9 ప్రకారం ఆయా దుకాణదారునికి ముందుగా నోటీ సు జారీ చేసి దానికి సరైన సమా ధానం ఇవ్వకపోతే ఆయా డీలర్‌ లైసెన్సును సస్పెండ్‌, రద్దు చేయవచ్చు.

విత్తనాల బస్తాలపై

లేబుల్‌ లేకపోతే..

ప్రైవేట్‌ విత్తనాల అమ్మకందారుడి వద్ద కొనుగోలు చేసిన విత్తనాల బస్తాలకు లేబుల్‌ లేకపోతే విత్తన చట్టం–1966 సెక్షన్‌ 7 ప్రకారం చర్యలు చేపట్టవ చ్చు. అంతే కాకుండా ఆయా విత్తనాలను జప్తు చేసే అధికారం ఉంది. అత్యవసర సరుకుల చట్టం–1955 సెక్షన్‌ 7 ప్రకారం జరిమానా విధిస్తారు. కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టం –1966 సెక్షన్‌ 7 ప్రకారం విత్తన నియంత్రణ ఉత్తర్వులు –1983 క్లాజు 8 ను అనుసరిస్తూ డీలర్‌ లైసెన్సు సస్పెండ్‌, రద్దు చేయవచ్చు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో సుమారు 495 ప్రైవేట్‌ డీలర్ల దుకాణాలు ఉన్నాయి. వాటిలో సుమారు 132 మంది విత్తనాల విక్రయాల డీలర్లు, 196 మంది ఎరువుల విక్రయా ల డీలర్లు, 167 మంది పురుగు మందు విక్రయాల డీలర్లు ఉన్నారు.

నిబంధనలు పాటించాలి

ప్రభుత్వం పొందు పరిచిన విత్తన చట్టానికి అనుగుణంగా ప్రైవేట్‌ విత్తనాల డీలర్లు విత్తనాలను విక్రయించాలి. ఈ విషయంలో ఆయా డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాతో పాటు దుకాణాల లైసెన్సును పొగొట్టుకునే పరిస్థితి ఉంటుంది.

– బీవీ తిరుమలరావు,

ఏడీ, వ్యవసాయ శాఖ, టెక్కలి

ప్రతి ప్రైవేటు విత్తనాల దుకాణంలో లైసెన్సు ప్రదర్శించాలి

కొనుగోలుదారునికి రశీదు తప్పనిసరి

No comments yet. Be the first to comment!
Add a comment
విత్తన చట్టం గురించి తెలుసా..1
1/1

విత్తన చట్టం గురించి తెలుసా..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement