వచ్చేశామోచ్‌..! | - | Sakshi
Sakshi News home page

వచ్చేశామోచ్‌..!

Published Mon, Jun 17 2024 1:50 AM | Last Updated on Mon, Jun 17 2024 1:50 AM

వచ్చే

కనువిందుచేస్తున్న సైబీరియా పక్షులు

ఏటా జూన్‌ నెలలో వచ్చి డిసెంబరు వరకు విడిది

కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా రాక

బొండపల్లి: వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి వివిధ దేశాలు దాటి క్రమం తప్పకుండా జిల్లాలోని బొండపల్లి ప్రాంతానికి వలస వస్తున్న విదేశీ సైబీరియా దేశ వలస పక్షులు ఈఏడాది కూడా తిరిగి వచ్చి సందర్శకులకు కనువిందు చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. పొడవాటి ముక్కు, కాళ్లు, భారీ ఆకారంతో పాటు, శరీరమంతా తెల్లని వెంట్రుకలు, మెడ దగ్గర మాత్రం తెల్లని వెంట్రుకలతో పాటు ఎరుపు రంగు వెంట్రుకలు కలిసి చూడగానే ఇట్టే ఆకట్టుకునే సైబీరియా దేశానికి చెందిన పక్షులు కొ న్ని సంవత్సరాలుగా బొండపల్లి మండలానికి చేరుకుని విడిది ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ పక్షులు సైబీరియా దేశం నుంచి ఏటా జూన్‌ నెలలో వల స వచ్చి వేసవి కాలంతో పాటు వర్షాకాలం ఇక్కడే ఉండి తిరిగి తమ సొంత దేశానికి వలస వెళిపో తుంటాయి.ఇది క్రమం తప్పకుండా జరుగుతోంది.

చెరువుల్లో ఆహారం సేకరణ

సైబీరియా పక్షులు మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న రామన్న సాగరం చెరువులో లభించే చిన్న,చిన్న చేపలతో పాటు ఇతర ఆహారాన్ని సేకరించుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి సాయంత్రం గజపతినగరం మండలంలోని లోగిశ గ్రామంలో గల చింత చెట్లను ఆవాసంగా చేసుకుని రాత్రంతా అక్కడే ఉంటాయి. తిరిగి ఆహారం కోసం ఉదయాన్నే చెరువు వద్దకు రావడం ఆరు నెలల పాటు జరుగుతుంటుంది.

పిల్లలు పెద్దవయ్యాక వలస

ఇక్కడికి ఈ పక్షులు జూన్‌ నెలలో వచ్చి సెప్టెంబర్‌ కల్లా గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి, అవి పెద్దవై ఎగిరే అవకాశం ఉన్నంత వరకు అంటే డిసెంబరు వరకు ఒక్కడే ఉండి తిరిగి పిల్లలతో సహా వాటి సొంత దేశం సైబీరియాకు వలస వెళ్లిపోతాయి. ఈ పక్షులు వచ్చాయంటే తమకు మంచి జరుగుతుందని ఈ ప్రాంత వాసులు భావిస్తుంటారు.

హాని చేస్తే జరిమానా విధింపు

ఈ పక్షులకు లోగిశ గ్రామం, చుట్టుపక్కల గ్రామాల వారితో పాటు బొండపల్లి చుట్టు పక్కల గ్రామాల వారు ఎటువంటి హాని తలపెట్టరు. అలాగే వాటికి ఎవరూ హాని చేసినా, వాటిని పట్టుకున్నా జరిమానా విధించాలని ఇక్కడి వారే కట్టుబాటు పెట్టుకుని పక్కాగా అమలు చేస్తున్నారు. ఇక్కడ జూన్‌ నెల నుంచి ఎండల తీవ్రతతో పాటు,ఆ తర్వాత వర్షాలు పడడం వల్ల సైబీరియా పక్షులకు ఇక్కడి వాతావరణం గుడ్లు పెట్టి పిల్లలు పోదిగేందుకు అనువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే క్రమం తప్పకుండా ఈ పక్షులు ఏటా వలస వస్తున్నాయని భావిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వచ్చేశామోచ్‌..!1
1/1

వచ్చేశామోచ్‌..!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement