గిరిజన యూనివర్సిటీతో ఎంఆర్ కళాశాల ఒప్పందం
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీతో పట్టణంలోని మహరాజా అటానమస్ కళాశాల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్థానిక యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి సమక్షంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్, ఎంఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు మధ్య ఒప్పంద సంతకాలు జరిగాయి. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)–2020 ప్రకారం పరిశోధన, విజ్ఞాన మార్పిడి, నైపుణ్య మార్పిడి మరియు ఇంటర్నషిప్‌లు, విద్య, విద్యార్థులు ఉద్యోగం పొందే విధంగా ఉపాధి నైపుణ్యాలు అందించే విధంగా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ డీన్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, పరిపాలన విభాగాధికారి డాక్టర్ ఎన్‌వీఎస్ సూర్యనారాయణ, ఎంఆర్ కళాశాల ఎస్టాబ్లేస్మెట్, అక్రిడేషన్ కన్వీనర్ డాక్టర్ పి.గణపతిరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment