బొండపల్లి: మండలంలోని గొల్లలపేట గ్రామంలో జిరాయితీ భూమిలో నిర్మించుకున్న రేకుల షెడ్డును పొక్లయినర్‌తో కూల్చివేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పీతల గుర్రయ్యకు చెందిన రేకుల షెడ్డు అదే గ్రామానికి చెందిన పీతల రాము కూల్చివేసినట్టు బాధిత కుటుంబ సభ్యులు వీఆర్‌ఓ కె.ప్రభాకరరావు దృష్టికి తీసుకువెళ్లారు. జిరాయితీలో రేకుల షెడ్డు ఉన్నందున తామేమి చేయలేమని పోలీసులకు ఆశ్రయించాలని ఆయన సూచించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుకు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ యు.మహేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment