రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
గజపతినగరం: గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. గజపతినగరం నుంచి మదుపాడ వెళ్తున్న మోటార్ సైకిల్ మానాపురం నుంచి గజపతినగరం వైపు వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మదుపాడ గ్రామానికి చెందిన గోపి, రవి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వైద్యం కోసం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
విజయనగరం టౌన్: నగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలను ఎస్పీ వకుల్ జిందల్ శనివారం మధ్యాహ్నం సందర్శించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునే విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో ఉన్న పోలింగ్ గదులను పరిశీలించారు. లైట్లు, ఫ్యాన్లు, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని పోలీస్, రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. పరిశీలనలో వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, ఎస్‌బీ సీఐ ఏవీ లీలారావు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్సైలు రామగణేష్, రవి, కళాశాల సూపర్‌వైజర్ ప్రసాద్, డీటీ సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
వృద్ధులపై చిన్నచూపు వద్దు
● సీనియర్ సివిల్ జడ్జి శారదాంబ
రాజాం సిటీ: వృద్ధులపట్ల చిన్నచూపు తగదని సీనియర్ సివిల్ జడ్జి కె.శారదాంబ అన్నారు. రాజాం పట్టణ పరిధి కొండంపేటలోని అనాథ వృద్ధాశ్రమాన్ని ఆమె శనివారం సందర్శించారు. వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలు, అందుతున్న సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు ఉండి నిరాదరణకు గురైన వారి వివరాలు తెలియజేయాలన్నారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనని అన్నారు. అనంతరం ఆశ్రమం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పి.శ్రీనివాస్, ఎస్.పోలారావు, కె.సాయిప్రశాంత్‌కుమార్, పి.చైతన్యకుమార్, ఎం.ఆదినారాయణ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment