ఏఆర్ సిబ్బంది మాక్ ఆపరేషన్
విజయనగరం క్రైమ్: సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగినపుడు సకాలంలో వాటిని అదుపు చేసి పరిస్థితులను అదుపులోకి తెచ్చేది ఆర్మర్డ్ రిజర్వు పోలీసు. అటువంటి ఏఆర్ సిబ్బంది శిక్షణ తరగతులను ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో శనివారం ఆయన ప్రారంభించారు. పోలీసు శాఖలో వెపన్స్ పట్టే ఏఆర్ సిబ్బందికి నిర్వహించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్‌ఐ గోపాలనాయుడు, రమేష్‌కుమార్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
గజపతినగరం రూరల్: బొండపల్లి మండలం రాచకిండాం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోనకి తీసుకొని మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ జె.జనార్దనరావు శనివారం తెలిపారు. నిందితుడు నుంచి పది మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. అక్రమంగా బెల్టు షాపులను గ్రామాల్లో నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాడుల్లో ఎస్‌ఐ సి.నరేంద్రకుమార్, హెచ్‌సీలు జె.బాషా, లోకాభిరామ్, సిబ్బంది రాజు గంగాధరుడు, వి.అప్పారావు, ఎ.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యా యత్నం
సీతానగరం: మండలంలోని గెడ్డలుప్పి గ్రామానికి చెందిన వ్యక్తి శనివారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... గెడ్డలుప్పి గ్రామానికి చెందిన సోంగల కృష్ణమూర్తి కడుపు నొప్పి తట్టుకోలేక అనారోగ్యానికి గురయ్యాడు. నొప్పులు తట్టుకోలేక ఇంట్లో వ్యవసాయ క్రిముల నివారణ మందును తాగాడు. కృష్ణమూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు గుర్తించిన కుటుంబీకులు 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
ఏఆర్ సిబ్బంది మాక్ ఆపరేషన్
Comments
Please login to add a commentAdd a comment