
టమాటా పంటను కొనుగోలు చేస్తాం..
బొబ్బిలి: టమాటా తదితర కూరగాయల పంటలను రైతులు కోసే ముందు సమాచారమిస్తే తాము వచ్చి రైతుబజార్లలో ఉన్న ధరలకే కొనుగోలు చేస్తామని బొబ్బిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఈశ్వరరావు, ఉద్యాన శాఖాధికారి మోహనకృష్ణ అన్నారు. ఈ నెల 19న సాక్షి ప్రధాన సంచికలో రైతు కష్టం..పశువుల పాలు అన్న శీర్షికన ప్రచురితమయిన కథనానికి ఇరు శాఖల అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, బాడంగి మండలాల్లో టమాటా, కూరగాయలు పండిస్తున్న రైతుల పొలాలను వారు సందర్శించారు. రైతులకు అవసరమయిన సూచనలు చేశారు. గిట్టుబాటు ధరల కోసం ముందుగా తమను సంప్రదించాలని, కచ్చితంగా రైతుబజార్ల ధరలకు కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. రైతులు కూడా ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేయకుండా 15 రోజుల చొప్పున వ్యవధి తీసుకుని సాగు చేయడం వలన ఉత్పత్తులకు డిమాండ్ కొనసాగుతుందన్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడితే పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు సోలార్ శీతల గిడ్డంగులు, కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు 75 శాతం రాయితీతో మంజూరు చేస్తామన్నారు. వీహెచ్‌ఏలు హైమావతి, అప్పలనాయుడు, ఆయా మండలాల రైతులు పాల్గొన్నారు.
ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులు

టమాటా పంటను కొనుగోలు చేస్తాం..
Comments
Please login to add a commentAdd a comment