
గడ్డి ట్రాక్టర్ దగ్ధం
గుర్ల: మండలంలోని గరికివలస, ఆనందపురం రోడ్డుపై గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఆదివారం దగ్ధమైంది. గరికివలస నుంచి భోగాపురం వెళ్తున్న గడ్డి ట్రాక్టర్‌కు ఆనందపురం రోడ్డుపై ఉన్న విద్యుత్ వైర్లు తాకడంతో మంటలు చేలరేగాయి. సమాచారం మేరకు విజయనగరం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆదుపుచేశారు. ఈ ప్రమాదంలో గడ్డి మొత్తం కాలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
డివైడర్‌ను ఢీకొని వ్యక్తికి
తీవ్ర గాయాలు
బొండపల్లి: మండలంలోని గొట్లాం గ్రామం వద్ద గల బైపాస్ రోడ్డుపై ఒంపల్లి గ్రామానికి వెళ్లే జంక్షన్ వద్ద డివైడర్‌ను గజపతినగరానికి చెందిన బి.బాలు తన ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో విజయనగరంలోని మహరాజా కేంద్ర సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రమాదం గురించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై మహేష్ తెలిపారు.
రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి
గంట్యాడ: మండలంలోని గింజేరు జంక్షన్ వద్ద ఆదివారం రెండు బైక్‌లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి స్కూటీపై అల్లాడ ఆనంద్, కుమార్ రాజాలు, చెల్లూరుకు చెందిన దాసరి నారాయణరావు బైక్‌పై అదే రోడ్డులో వెళ్తుండగా గింజేరు జంక్షన్ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి స్కూటీని బైక్ ఢీకొట్టింది. దీంతో స్కూటీ వెనుక కూర్చున్న అల్లాడ ఆనంద్ తుళ్లి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూటీని నడుపుతున్న కుమార్‌రాజాకు, మోటార్ బైక్ నడుపుతున్న దాసరి నారాయణరావుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిద్దరిని 108 అంబులెన్సులో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సాయి కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పార్వతీపురం టౌన్: సీతానగరం మండలం గెడ్డలుప్పి గ్రామానికి చెందిన చొంగలి కృష్ణమూర్తి చాలాకాలంగా మెడ, రెండుభుజాల నొప్పితో బాధపడుతున్నాడు. మూడు రోజుల క్రితం నొప్పిని భరించలేక గడ్డిమందు తాగేసి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే 108 వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

గడ్డి ట్రాక్టర్ దగ్ధం

గడ్డి ట్రాక్టర్ దగ్ధం

గడ్డి ట్రాక్టర్ దగ్ధం
Comments
Please login to add a commentAdd a comment