
డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిఘా
విజయనగరం క్రైమ్: డ్రోన్స్, సీసీ కెమెరా నిఘాతో నేరాల కట్టడి, నియంత్రణకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా పట్టణాల్లో జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు పోలీస్‌శాఖ ఐడీ పార్టీలతో పాటు డ్రోన్స్‌ను వినియోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం విజయనగరంలో మూడు డ్రోన్ కెమెరాలతో పాటు కొత్తగా సీసీ కెమెరాలను కూడా వినియోగించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇదే విషయాన్ని ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు మూడు సబ్ డివిజన్‌లైన బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం పరిధిలో పండగలు, ఉత్సవాలు, ర్యాలీలు వంటి బహిరంగ కార్యక్రమాల్లో ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా డ్రోన్స్ వినియోగిస్తున్నట్టు ఎస్పీ చెప్పారు. ప్రస్తుతం ఉన్న మూడు డ్రోన్స్‌తో పాటు సీసీ కెమెరాలను కూడా వినియోగిస్తున్నామన్నారు.ఈ మూడు సబ్ డివిజన్‌ల పరిధిలో అన్ని సంస్థలు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఆయా సంస్థల ప్రతినిధులతో సీసీ కెమారాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే రహదారి ప్రమాదాలు అరికట్టేందుకు, ఈవ్‌టీజింగ్ నియంత్రణ, చైన్ స్నాచింగ్‌లు జరగకుండా ఉండేందుకు డ్రోన్స్ వాడుతున్నామన్నారు. ఇక రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి తద్వారా అసలు ప్రమాదాలే జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డ్రోన్స్‌తో పాటు సీసీ కెమెరాలను సంబఽంధిత సంస్థలు, ప్రతినిధులతో కొనుగోలు చేయించి అమర్చుతున్నామని ఎస్పీ వకుల్ ఈ సందర్భంగా అన్నారు. ఈ తరహాలోనే జనవరి, ఫిబ్రవరి నెలల్లో బహిరంగంగా మద్యం తాగిన వారిని గుర్తించామని చెప్పారు. అలాగే మద్యం తాగి వాహనాలను నడిపిన వారిని గుర్తించి దాదాపు 4,300 కేసులు కేసులునమోదు చేశామని తెలిపారు.
ఎస్పీ వకుల్ జిందల్
Comments
Please login to add a commentAdd a comment