
‘చీకటి పువ్వు’కు ప్రథమ బహుమతి
● ద్వితీయ బహుమతి దక్కించుకున్న కొత్త పరిమళం
● ఘనంగా ముగిసిన నాటక పోటీలు
నెల్లిమర్ల: నరగపంచాయతీ పరిధిలోని జరజావుపేటలో మూడు రోజులపాటు జరిగిన ఆరిపాక బ్రహ్మానందం స్మారక నాటక పోటీల్లో కరీంనగర్ చైతన్య కళాభారతి కళాకారులు ప్రదర్శించిన ’చీకటి పువ్వు’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతి శ్రీకాకుళం జిల్లా బొరివంకకు చెందిన శార్వాణి గిరిజన సాంస్కతిక సేవా సంఘం కళాకారులు ప్రదర్శించిన ’కొత్త పరిమళం’ నాటికకు లభించింది. కాగా తృతీయ ఉత్తమ ప్రదర్శనగా విశాఖపట్నం తెలుగు కళా సమితి కళాకారులు ప్రదర్శించిన ’నిశ్శబ్దమా నీ ఖరీదెంత?’ నాటిక నిలిచింది. శనివారం అర్థరాత్రి జరిగిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ చనమల్లు వెంకటరమణ, నగర పంచాయతీ వైస్‌చైర్మన్ సముద్రపు రామారావు. అవనాపు సత్యనారాయణ, గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు.
విజేతల వివరాలు
ఉత్తమ దర్శకుడు బహుమతి మంచాల రమేష్ (చీకటి పువ్వు), ఉత్తమ రచయిత బహుమతి కేకేఎల్ స్వామి (కొత్త పరిమళం), ఉత్తమ నటుడు బహుమతి పి.వరప్రసాద్ (నిశ్శబ్దమా నీ ఖరీదెంత)కు లభించాయి. ద్వితీయ ఉత్తమ నటుడుగా డి.గిరిబాబు (చీకటి పువ్వు), ఉత్తమ నటిగా జి.లహరి (చీకటి పువ్వు) ద్వితీయ ఉత్తమ నటిగా డి.హేమ (నిశ్శబ్దమా నీ ఖరీదెంత)ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా రాంబాబు (నిశ్శబ్దమా నీ ఐరీదెంత), ఉత్తమ సహాయ నటుడుగా శోభన్ బాబు(కొత్త పరిమళం) ఉత్తమ విలన్‌గా దలం (కొత్త పరిమళం), ఉత్తమ హాస్యనటుడిగా బి.కన్నబాబు (నిశ్శబ్దమానీ ఖరీదెంత)కు బహుమతులు లభించాయి. ఉత్తమ రంగాలంకరణ రమణ (కొత్త పరిమళం), ఉత్తను సంగీతం లీల –మోహన్ (చీకటి పువ్వు), ఉత్తమ ఆహార్యం రమణ (కొత్త పరిమళం) జ్యూరీ బహుమతులు సత్యనారాయణ (దేవరాగం), డి.రాధాకృష్ణ (ఎడా రిలో వాన చినుకు) భుజంగరావు (రైతే రాజు)కు లభించాయి. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కుసుమాల నాగభూషణం, కేవీ మంగారావు, మానాపురం సత్యనారాయణ వ్యవహరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సముద్రపు రామారావు, అవనాపు సత్యనారాయణ, ఎంఎం నాయుడు, నల్లి బంగారు చంద్రశేఖర్, తుమ్ము వెంకటరమణ, జనాప్రసాద్, మద్దిల సన్యాసిరావు, కాళ్ల రాజశేఖర్, డొంక కష్ణ, మద్దిల వాసు, ముత్యాల నాయుడు, కనకల హైమావతి నిర్వాహక కమిటీ ప్రతినిధులు ఈపు విజయకుమార్, ఆరిపాక శ్రీనివాసరావు,ఆరిపాక రాము తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment