
కనులపండువగా సిరిమాను చెట్టు ఊరేగింపు
సాలూరు: సాలూరు పట్టణంలో మే నెలలో జరగనున్న శ్రీ శ్యామలాంబ తల్లి జాతర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో కీలకమైన అమ్మవారి సిరిమాను చెట్టు ఊరేగింపు కనుల పండువగా జరిగింది. సుమారు 50 జతల ఎద్దులు, 2 ట్రాక్టర్‌లతో వేలాదిమంది భక్తులు తరలిరాగా పురవీధుల్లో అమ్మవారి సిరిమాను ఊరేగింపు వేడుకగా జరిగింది. దారిపొడవునా భక్తులు ముర్రాటలు, పసుపు కుంకుమలు సిరిమానుపై వేసి పూజలు చేశారు. ఎడ్ల బండ్లు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తూ, అంతరించిపోతున్న నాటి సంప్రదాయం మళ్లీ గుర్తుకువచ్చేలా చేశాయి. పులివేషాలు, తీన్మార్, సన్నాయి మేళం నడుమ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. స్థానికంగా ఆధ్యాత్మికతతో కూడిన సందడి వాతావరణం నెలకొంది.

కనులపండువగా సిరిమాను చెట్టు ఊరేగింపు
Comments
Please login to add a commentAdd a comment