
ఆటో, బైక్ ఢీ: ఇద్దరికి గాయాలు˘
బొబ్బిలి రూరల్: దత్తిరాజేరు మండలం విజయరాంపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తుండగా వవెనుకనుంచి వస్తున్న ఆటో ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. ఆదివారం మండలంలోని రంగరాయపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో విజయరాంపురానికి చెందిన గౌరి ఆమె కుమారుడు సునీల్ కుమార్‌లు గాయపడగా వారిని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందజేశారు.
రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తికి..
చీపురుపల్లి: పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో ఒక రైలు బదులు పొరపాటున మరో రైలు ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి దూబ అప్పన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 ఈఎంటి జయముని, పైలట్ సీహెచ్.తవిటినాయుడులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళికి చెందిన దూబ అప్పన్న చీపురుపల్లి రైల్వేస్టేషన్‌లో హౌరా–చెన్నయ్ మెయిల్ ఎక్కి తరువాత తాను ఎక్కాల్సిన రైలు కాదని తెలుసుకుని దిగుతుండగా ప్రమాదవశాత్తూ కాలు ఇరుక్కపోయింది. ఇంతలోనే రైలు కదలడంతో కుడి కాలు మొత్తం నుజ్జునుజ్జయ్యింది.
అలరించిన సంగీత విభావరి
విజయనగరం టౌన్: ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ 67వ వార్షికోత్సవం పురస్కరించుకుని బండారు చిట్టిబాబు పర్యవేక్షణలో బండారు రమణమూర్తి సంగీత దర్శకత్వంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన లలిత సంగీత విభావరి ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకుంది. వేణువుపై వెల్లంకి కూర్మనాథం, కీబోర్డుపై సోమేష్, ప్యాడ్స్‌పై బాబూరావు, తబలాపై రమణమూర్తి సహకరించారు. వ్యాఖ్యాతగా మండా వెంకట కామేశ్వరరావు, గాయకులు సాయి ప్రశాంతి, శ్రీవిద్య, శారద, శైలజ, పావని, భాస్కర్ తమవంతు సహకారం అందించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు ధవళ సర్వేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ మండపాక రవి, కాళ్ల నిర్మల, సంగీతాభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment