
బర్డ్‌ఫ్లూపై ఆందోళన అనవసరం
పార్వతీపురంటౌన్: జిల్లాలో బర్డ్‌ఫ్లూ సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న ఉదంతులు, అపోహాలు నమ్మవద్దని, ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బర్డ్‌ఫ్లూ నియంత్రణపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బర్డ్‌ఫ్లూ పక్షులకు మాత్రమే వస్తుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకదని స్పష్టం చేశారు. బర్డ్‌ఫ్లూ సోకిన ప్రాంతాల ప్రజలు అరోగ్యంగా ఉండడానికి మాత్రమే కాకుండా వైరస్‌వ్యాప్తిని అడ్డుకోవడానికి పలు జాగ్రత్తలు అవసరమని తెలిపారు. ఏదైనా జ్వరం, జలుబు, తలపోటు, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు వచ్చిన వెంటనే వైద్యసిబ్బందికి తెలియజేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఇంటింటి నిఘా కోసం ఆశ కార్యర్తలు, ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఎంఎన్‌ఓలతో బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కోడుగుడ్లు, చికెన్ వినియోగానికి ముందు శుభ్రం చేసుకోవడంతో పాటు వంటకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 160 డిగ్రీల వద్ద వేడిచేసి తినాలని సూచించారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కరరావు
Comments
Please login to add a commentAdd a comment