
విజయనగరం
సోమవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
కళా ఇది నీకు తగునా..!
సిరిమాను చెట్టు ఊరేగింపు
సాలూరు పట్టణంలో మే నెలలో జరగనున్న
శ్రీ శ్యామలాంబ తల్లి జాతర ఏర్పాట్లు
ముమ్మరంగా జరుగుతున్నాయి.
–8లో
చిచ్చు రేపిన డీలర్ ఉద్యోగం
ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య చెలరేగిన ఘర్షణ కొట్లాటకు దారి తీసింది.
–8లో
గుర్ల: ఎమ్మెల్యే కమిడి కళావెంకటరావు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. వివరాల్లోకి వెళ్తే.. గుర్ల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే కళా వెంకటరావు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతుగా శనివారం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంలో ఎమ్మె ల్యే కోడ్‌ను ఉల్లంఘించి హైస్కూల్ హెచ్‌ఎం, కళాశాల ప్రిన్సిపాల్ సీట్లలో కూర్చొని ఎన్నికల ప్రచా రం చేశారు. ఎన్నికల్లో రఘువర్మకు ఓటు వేయాల ని ఉపాధ్యాయులకు సూచించారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కళావెంకటరావు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మాజీ ఎమ్మెల్సీ అజశర్మ విశాఖపట్నంలోని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కళావెంకటరావుపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
న్యూస్‌రీల్
యథేచ్ఛగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్
ఉల్లంఘన
ప్రభుత్వ అధికారుల సీట్లలో కూర్చొని దర్జాగా ప్రచారం

విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment