మనసులోనే.. మధనపడుతూ...!
వారంతా ఆరోగ్యశ్రీ రోగులు.. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు నాణ్యమైన భోజనం అందించాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి పలు ఆస్పత్రుల్లో లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. భోజనం బాగా లేకున్నా... ఇవ్వాల్సినంత పరిమాణంలోనే ఇవ్వకున్నా... ఆ రోగులు మనసులోనే మధనపడుతూ వైద్య సేవలు పొందుతున్నారు. భోజనం బాగాలేదని బయటకు చెబితే సేవల్లో ఎక్కడ నిర్లక్ష్యం ప్రదర్శిస్తారోనని వారంతా కలత చెందుతూ లోలోపల బాధపడుతూ వైద్య సేవలు పొందుతున్నారు.
భోజనం మెనూ ఇలా...
ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం రోగులకు ఉదయం 150 గ్రాముల గల మూడు ఇడ్లీ, 100 గ్రాముల చట్నీ, మిల్క్ బ్రెడ్ ఏడు సైల్స్ ఉన్నవి (140 గ్రాములు, బన్సీ రవ్వ ఉప్మా రవ్వ (300 గ్రాములు) వీటిల్లో ఏదో ఒకటి పెట్టాలి. అదేవిధంగా 150 ఎం.ఎల్ పాలు ఇవ్వాలి. మధ్యాహ్నం మూడు పుల్కాలు (ఒక్కోటి 30 గ్రామలు బరువు ఉండాలి) గాని, 450 గ్రాముల సోనామసూరి వండిన అన్నం, వెజిటిబుల్ కర్రీ ఒక కప్పు, సాంబారు(30 గ్రాములు కందిపప్పు ఉండాలి), 50 గ్రాముల గల ఉడికించిన గుడ్డు, 100 గ్రాముల పెరుగు, అరటి పండు ఒకటిగాని సీజనల్‌గా దొరికే పండుగాని ఇవ్వాలి. రాత్రికి 3పుల్కాలు (30 గ్రాములు బరువు ఉండేవి) గాని సోనామసూరి రైస్ 450 గ్రాములు వండిన అన్నం, మిక్స్‌డ్ వెజిటిబుల్ కర్రీ ఒక కప్పు, సాంబారు (కంది పప్పు 30 గ్రాములు ఉండాలి), 50 గ్రాముల ఉడికించిన గుడ్డు ఒకటి, 150 గ్రాముల పాలు రెండు టీ స్పూన్‌ల పంచదారతో కలిపి ఇవ్వాలి. కానీ ఈ మెనూ చాలా నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అన్నంతో పాటు, పాలు, కూర, సాంబారు, పెరుగులోనూ నాణ్యత, పరిమాణం పాటించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. అన్నం, పెరుగు, పరిమాణం తక్కువగా ఉంటుందనే విమర్శలూ వ్యక్తం అవుతున్నాయి. సాంబారులో వేయాల్పిన పరిమాణంకు తగ్గట్టుగా కంది పప్పు వేయడం లేదని చెబుతున్నారు. ప్రతీ రోజు ఈ భోజనాన్ని ఆరోగ్యశ్రీ అధికారులు, సిబ్బంది పరిశీలించాల్సి ఉండగా, పరిశీలన పూర్తి స్థాయిలో జరగడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
● ఆరోగ్యశ్రీ భోజనంలో డొల్లతనం...!
● నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు
● జిల్లాలో ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు 25
● ప్రభుత్వ నెట్‌వర్క్ ఆస్పత్రులు 9
● 46 పీహెచ్‌సీల్లో కూడా ఆరోగ్యశ్రీ అమలు
● ఈ ఆస్పత్రుల్లో కేటాయించిన బెడ్లు 1220
● సగటున ప్రతీ రోజు 1000 నుంచి 1200 మందికి భోజనాలు
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) పథ కం కింద చికిత్స పొందే రోగులకు అందించే భోజ నంలో నెట్‌వర్క్ ఆస్పత్రులు నిబంధనలు పాటించ డం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ నిబంధనలను పక్కనపెట్టి ఏదో పెట్టాం.. వారే తింటారన్న చందాన నెట్‌వర్క్ ఆస్పత్రులు భోజనం పెడుతున్నట్టు రోగుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. నాణ్యత... పరిమాణం రెండూ పాటించడం లేదన్న ఆరోప ణలు ఉన్నాయి. ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నిబంధనలు అసలు పాటించడం లేదన్నది రోగుల అభిప్రాయంగా ఉంది. వాస్తవానికి సాధారణ రోగుల కంటే ఆరోగ్యశ్రీ రోగులకు మెరుగైన భోజనం అందించాలి.
లోలోపల..
ఆరోగ్యశ్రీ రోగులకు అందించే భోజనం బాగాలేకపోయినా రోగులు బయటకు చెప్పలేకపోతున్నారు. ఎక్కడైతే ఆరోగ్యశ్రీ కింద పేషంట్ జాయిన్ అవుతాడో అక్కడే పూర్తి స్థాయిలో చికిత్స పొందాల్సి రావడంతో బయటకు చెబితే వైద్య సేవలు అందించడంలో నూ ఇబ్బందులు పెడతారని మనసులోనే.. మధన పడుతున్నారు. కానీ బయటకు చెప్పడం లేదు.
జిల్లాలో ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు 25
జిల్లాలో ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు 25 ఉన్నాయి. అభినవ ఆస్పత్రి, అమృత, ఆంధ్ర, గాయిత్రి, జీఎంఆర్ వరలక్ష్మి, కావేరి, కొలపర్తి, మువ్వగోపాల, నెప్రో ప్లస్, పీజీ స్టార్, పుష్పగిరి విక్టోరియా రెటినో ఇనిస్టిట్యూట్, క్వీన్స్ ఎన్‌ఆర్‌ఐ, సంజీవిని సూపర్ స్పెషాలటీ, బాబూజీ, శ్రీసాయి సూపర్ ఆస్పత్రి, శ్రీసాయికృష్ణ, సాయి పీవీఆర్, శ్రీనివాస నర్సింగ్ హోమ్, సన్‌రైజ్, స్వామి కంటి ఆస్ప త్రి, తిరుమల మెడికవర్ ఆస్పత్రి, వెంకటరామ, వెంకటపద్మ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం ఉంది. ప్రభుత్వ నెట్‌వర్క్ ఆస్పత్రులు 55 ఉన్నాయి. ఇందులో జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, సీహెచ్‌సీలు 9 ఉన్నాయి. పీహెచ్‌సీలు 46 ఉన్నాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, బొబ్బిలి సీహెచ్‌సీ, గజపతినగరం ఏరియా ఆస్పత్రి, రా జాం ఏరియా ఆస్పత్రి, ఎస్.కోట ఏరియా ఆస్పత్రి, బాడంగి సీహెచ్‌సీ, భోగాపురం సీహెచ్‌సీ, బొబ్బిలి సీహెచ్‌సీ, నెల్లిమర్ల సీహెచ్‌సీ, ఘోషాస్పత్రి.
నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో 1220 బెడ్లు కేటాయింపు
ప్రభుత్వ, ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి 1220 బెడ్లు కేటాయించా రు. ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో 751, సీహెచ్‌సీ,
ఏరియా ఆస్పత్రిల్లో 321, పీహెచ్‌సీల్లో 148 బెడ్లు కేటాయించారు. ఇందులో సగటున 1000 నుంచి 1200 మంది వరకు రోగులు చికిత్స పొందుతుంటారు. వీరికి మెరుగైన భోజనం అందించాల్సి ఉంది.
భోజనాన్ని పరిశీలిస్తాం..
ఆరోగ్యశ్రీ రోగులకు నాణ్యతతో కూడిన మెరుగైన భోజనం మెనూ ప్రకారం ఇవ్వాలి. ప్రతీ రోజు ఆరోగ్యమిత్రాలను భోజనం రుచి చూడాలని చెబుతున్నాం. ఆస్పత్రుల్లో రోగులకు అందించే భోజనాన్ని పరిశీలిస్తాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ కొయ్యాన అప్పారావు,
ఆరోగ్యశ్రీ ఇన్‌చార్జి కో – ఆర్డినేటర్
మనసులోనే.. మధనపడుతూ...!
మనసులోనే.. మధనపడుతూ...!
మనసులోనే.. మధనపడుతూ...!
Comments
Please login to add a commentAdd a comment